ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

by Taduka Kalyani |

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
X

దిశ, అల్వాల్ : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాపురం డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో రూ.15.5 లక్షల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వెంకటేష్, మేనేజర్ రమేష్, నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, కరుణాకర్, రాజేష్, శశాంక్, శ్రీనివాస్, శ్రీనాథ్ వెంకటేశం, స్వామి యాదవ్, రజిని, శివశ్రీ లక్ష్మి, శైలజ, విజయశేఖర్, మోసిన్ ప్రభాకర్, సురేష్, ముత్యాలు, శరణు గిరి, మహి, సోమయ్య, ప్రకాష్ గౌడ్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Next Story