అతి త్వరలో ఏపీకి నైరుతి రాక : విశాఖ వాతావరణ కేంద్రం

by Naga Rani Yarlagadda |

ఏపీలో నైరుతి విస్తరణపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. గతవారం మోస్తరు వర్షాలు కురిసినా.. తాత్కాలిక ఉపశమనం మాత్రమే దక్కింది.

అతి త్వరలో ఏపీకి నైరుతి రాక : విశాఖ వాతావరణ కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నైరుతి విస్తరణపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. గతవారం మోస్తరు వర్షాలు కురిసినా.. తాత్కాలిక ఉపశమనం మాత్రమే దక్కింది. ఆ తర్వాతి నుంచి మళ్లీ ఎండలు ముదిరి.. ఉక్కపోత పెరిగింది. దీంతో ప్రజలు, రైతన్నలు వర్షాకాలం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఏపీలో విస్తరించేందుకు కొంత సమయం పడుతుందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. కేరళలో విస్తరించిన రుతుపవనాలు.. క్రమంగా ఉత్తరదిశగా కదులుతున్నాయని, ఇవి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది. మరో రెండు, మూడ్రోజుల్లో రాయలసీమలో, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో కొన్నిప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ముందుగా అంచనా వేసినదాని ప్రకారం జూన్ 15 నాటికి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించాలని, వాతావరణం అనుకూలంగా ఉండటంతో కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. రాబోయే వారంరోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని, అప్పటి వరకూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో పాటు.. ఐదురోజులపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఈ సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Next Story