కొబ్బరినీళ్లు తాగితే కిడ్నీ‌ స్టోన్స్ కరిగిపోతాయా?

by Javid Pasha |   (  Updated:2026-06-05 10:16:28  IST  )

కొబ్బరి నీళ్లలో ఉండే సహజ ఎంజైములు, సమ్మేళనాలు, ఆల్కలైన్ లక్షణాలు యూరిన్‌లో సిట్రేట్ లెవెల్స్‌ను పెంచుతాయి. ఇది కాల్షియంతో కలిసి స్టోన్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.

కొబ్బరినీళ్లు తాగితే కిడ్నీ‌ స్టోన్స్ కరిగిపోతాయా?
X

దిశ, ఫీచర్స్ : కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు తాగండి ఆరోగ్యానికి మంచిది అంటుంటారు పెద్దలు. వీటిలోని పోషకాలు అనేక ప్రయోజనాలు కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇవి కాల్షియం ఆక్సలేట్( calcium oxalate) కిడ్నీ స్టోన్స్‌ను నివారించడంలోనూ సహాయపడతాయని ఫిలిప్పీన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనాల ప్రకారం.. కొబ్బరి నీళ్లలో ఉండే సహజ ఎంజైములు, సమ్మేళనాలు, ఆల్కలైన్ లక్షణాలు యూరిన్‌లో సిట్రేట్ లెవెల్స్‌ను పెంచుతాయి. ఇది కాల్షియంతో కలిసి స్టోన్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే చిన్న చిన్న స్టోన్స్ కూడా సులభంగా బయటకు వచ్చేలా సహాయపడుతుంది. కొంతమంది రోగుల్లో నొప్పి తగ్గడం, స్టోన్స్ ఈజీగా పాస్ అవడం వంటి ప్రయోజనాలు కనిపించినట్లు అధ్యయన నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగనీ కొబ్బరి నీళ్లు తాగడమే కిడ్నీ‌స్టోన్స్ నివారణ లేదా గ్యారెంటీడ్ చికిత్స కాదు. చిన్న సైజులో.. ప్రారంభ దశలో స్టోన్స్ ఏర్పడే పరిస్థితిని మాత్రం నివారిస్తాయి. పెద్ద సైజు స్టోన్స్ (5-10 mm కంటే ఎక్కువ), బ్లాకేజ్ ఉన్నవి లేదా కాంప్లికేటెడ్ కేసుల్లో వైద్య చికిత్స లేదా సర్జరీ తప్పక అవసరమే.

రోజుకు 1-2 గ్లాసులు (సుమారు 500-1000 ml) కొబ్బరినీళ్లు తాగడం కిడ్నీ ఆరోగ్యానికే కాదు. ఇంకా ఇతర ప్రయోజనాలు సైతం ఉన్నాయి. అయితే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొబ్బరి నీళ్లల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు ఒక కప్పులో 400-600 mg వరకు ఉంటుంది. కిడ్నీలు సరిగా పని చేయనప్పుడు ఈ అధిక పొటాషియం రక్తంలో పేరుకుపోయి ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి స్టోన్స్ సమస్య ఉంటే తప్పకుండా యూరాలజిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ని సంప్రదించి సలహా తీసుకోవాలి. మొత్తానికి కొబ్బరి నీళ్లు సహజంగా హైడ్రేషన్ & సిట్రేట్ పెంచే మంచి ఆప్షన్‌గా ఉంటాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story