కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

by Taduka Kalyani |   (  Updated:2026-06-05 10:18:25  IST  )

కళాశాల హాస్టల్‌లో ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వనస్థలిపురం : నగర శివారులోని ఓ కళాశాల హాస్టల్‌లో ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. హనుమకొండకు చెందిన కోమటిరెడ్డి దేవేందర్‌రెడ్డి (17) అనే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. హయత్ నగర్ సీఐ నాగరాజ్ గౌడ్ వివరాల ప్రకారం..దేవేందర్‌రెడ్డి ఇటీవల మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి, రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 2న అతని తండ్రి జలపతిరెడ్డి కళాశాలలో దింపి వెళ్లారు. గురువారం రాత్రి స్టడీ అవర్‌ అనంతరం గదికి వెళ్లిన సహ విద్యార్థులు, దేవేందర్‌రెడ్డి బెడ్‌షీట్‌, టవల్‌తో ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. వెంటనే హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారం అందించగా, అతడిని కిందకు దించి హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, సహ విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Next Story