వినియోగదారులకు బిగ్ షాక్.. మరోసారి మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు!

by Muthe.Rajitha |

దేశంలోని మొబైల్ వినియోగదారుల జేబులకు టెలికాం కంపెనీలు మరోసారి చిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

వినియోగదారులకు బిగ్ షాక్.. మరోసారి మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని మొబైల్ వినియోగదారుల జేబులకు టెలికాం కంపెనీలు మరోసారి చిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న 3 నుండి 6 నెలల కాలంలో దేశీయ టెలికాం రంగంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ క్యాపిటల్ (Axis Capital) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా విశ్లేషించారు. అయితే, గతంలో ఒకేసారి 20 శాతం వరకు పెంచినట్లు కాకుండా, ఈసారి ఈ టారీఫ్ పెంపు కేవలం 10 నుండి 12 శాతం లోపు మాత్రమే ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా 5G ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులను రాబట్టుకోవడానికి ప్రతి వినియోగదారుడిని టార్గెట్ చేసుకొని కంపెనీలు ఈ ధరల పెంపును ఒక వ్యూహంగా ఎంచుకున్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల (Middle East Crisis) కారణంగా ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మొబైల్ టవర్ల నిర్వహణ ఖర్చులలో దాదాపు 40 శాతం వరకు పవర్, డీజిల్ కోసమే ఖర్చు అవుతుంది. అందువల్ల డీజిల్ ధరలు పెరిగితే టెలికాం కంపెనీల నిర్వహణ భారం మరింత ఎక్కువవుతుంది. ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా 10 శాతం వరకు పెరిగితే.. కామన్ మ్యాన్ నెలవారీ బడ్జెట్‌పై ఇది మరింత అదనపు భారంగా మారనుంది. మరోవైపు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రధాన కంపెనీలు ఇప్పటికే కొన్ని సర్కిళ్లలో తమ ఎంట్రీ లెవెల్ ప్లాన్ల ప్రయోజనాలను సవరించడం లేదా స్వల్పంగా ధరలను పెంచడం ప్రారంభించాయి. రాబోయే రోజుల్లో ఈ పెంపు అధికారికంగా అన్ని ప్లాన్లకు వర్తించే అవకాశం ఉంది.

Next Story