చిరు బ్యానర్‌కు తప్పని కష్టాలు

by Pulgam srinivas |

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘జన నాయగన్’, ‘టాక్సిక్’ సినిమాలు విడుదల విషయంలో సమస్యలను ఎదుర్కొంటూ వాయిదా పడుతున్నాయి.

చిరు బ్యానర్‌కు తప్పని కష్టాలు
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ రెండు చిత్రాలను పూర్తి చేసినప్పటికీ, ఆ రెండు సినిమాలకు సంబంధించిన విడుదల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ బ్యానర్ తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘జన నాయగన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. దాంతో ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే సినిమా విడుదలకు సిద్ధమని భావించిన సమయంలో సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయింది.

ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన విడుదలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇదే బ్యానర్ యష్ హీరోగా ‘టాక్సిక్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రీ-షూట్స్ జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఈ బ్యానర్‌పై రూపొందిన రెండు సినిమాల విడుదల విషయంలో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్ మాత్రం ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.

Next Story