- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదాయానికి మించిన ఆస్తులు.. సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
కాకినాడ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్ ఇంట్లో ACB అధికారులు సోదాలు చేపట్టారు..

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ కలెక్టరేట్(Kakinada Collectorate)లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్ ఇంట్లో ACB అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన తన ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో శివకుమార్‌కు చెందిన నివాసంతో పాటు ఆయన పనిచేస్తున్న కార్యాలయంలోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను, ఆస్తి వివరాలను అధికారులు పరిశీలించారు.
ఆదాయ వనరులకు, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు మధ్య గల వ్యత్యాసాలపై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ తనిఖీలకు సంబంధించిన మరిన్ని వివరాలు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Next Story






