- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి
డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా కీటక జనిత వ్యాధి నియంత్రణ కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి కాల్వ చక్రధర్ అన్నారు.

దిశ, జగదేవపూర్: డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా కీటక జనిత వ్యాధి నియంత్రణ కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి కాల్వ చక్రధర్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్ లో డెంగ్యూ నివారణ పై జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది గ్రామంలో నమోదైన డెంగ్యూ కేసులు, వాటి ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రధర్ మాట్లాడుతూ.. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే గ్రామంలోని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు సమాచారం అందిస్తే సకాలంలో చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తిగుల్ వైద్యాధికారి డాక్టర్ రాజు గౌడ్, గ్రామ సర్పంచ్ రాజు, కార్యదర్శి భాను, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.






