- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరు మహిళలను దేశం దాటించొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
అసోం గోల్‌పారా డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: అసోంలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ (Foreigners Tribunal) నుంచి విదేశీయులుగా ప్రకటించబడి, డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్న సలేహా ఖాతూన్, సర్భాను బేగం అనే ఇద్దరు మహిళల దేశ బహిష్కరణపై (Deportation) సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు వెకేషన్ బెంచ్ కీలక ఉత్తర్వును జారీ చేసింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ నలుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి.మోహనాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి (Union Government) నోటీసులు జారీ చేస్తూ, ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కోరింది.
జూలై 16 వరకు తాత్కాలిక ఊరట...
సలేహా ఖాతూన్, సర్భాను బేగం ఇద్దరూ మార్చి 2026 నుంచి అసోంలోని గోల్‌పారా డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో మగ్గుతున్నారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 16కు వాయిదా వేసింది. అంతవరకు, సలేహా ఖాతూన్, సర్భాను బేగంలు డిటెన్షన్‌లోనే కొనసాగినప్పటికీ, తదుపరి విచారణ తేదీ జూలై 16 వచ్చే వరకు వారిని దేశం నుంచి బహిష్కరించకూడదని (Deport) సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.






