పెట్టుబడిదారుల కోసం కేంద్ర ఆర్థిక శాఖ కీలక చర్యలు!

by Malleboina Mahesh |

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా భారత్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక చర్యలు. విదేశీ పెట్టుబడిదారులు (FPIs, PROIs) పెట్టుబడులు పెట్టే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం.

పెట్టుబడిదారుల కోసం కేంద్ర ఆర్థిక శాఖ కీలక చర్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా (Global Investment Destination) బలోపేతం చేసేందుకు, దేశీయ మూలధన మార్కెట్‌ను (Capital Market) మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance) విదేశీ పెట్టుబడిదారుల కోసం సరికొత్త విధానాలను, సంస్కరణలను ప్రవేశపెట్టింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే ప్రక్రియను మరింత సులభతరం (Ease of Investment) చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

విదేశీ మూలధనాన్ని ఆకర్షించడమే లక్ష్యం

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాల వల్ల వ్యక్తిగత ప్రాతిపదికన భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తులకు (PROIs - Persons Resident Outside India), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు (FPIs - Foreign Portfolio Investors) భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుంది. దేశంలోకి స్థిరమైన, దీర్ఘకాలిక విదేశీ మూలధన ప్రవాహాన్ని (Stable Long-term Foreign Capital Flows) పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేసింది. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించడం తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ ప్రతిష్టను మరింత పెంచనున్నట్లు తెస్తుంది.

Next Story