- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుష్ప గ్రూపులో పుష్ప సినిమా తరహా ట్విస్ట్..
కారేపల్లి మండలంలోని గంగారం తండాలో డ్వాక్రా మహిళా సంఘంలో భారీ అక్రమాల ఆరోపణలు వెలుగుచూశాయి.

దిశ, కారేపల్లి: కారేపల్లి మండలంలోని గంగారం తండాలో డ్వాక్రా మహిళా సంఘంలో భారీ అక్రమాల ఆరోపణలు వెలుగుచూశాయి. సభ్యుల అనుమతి లేకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేసి రూ. లక్ష రుణాన్ని మంజూరు చేయించారని ‘పుష్ప’ గ్రూప్ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ సభ్యుల కథనం ప్రకారం, దాదాపు పదేళ్లుగా ‘పుష్ప’ పేరుతో పది మంది సభ్యులతో సంఘాన్ని నిర్వహిస్తూ రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నామని తెలిపారు.అయితే ఇటీవల గ్రూప్ సభ్యుల అనుమతి లేకుండానే సెకండ్ లీడర్ నకిలీ సంతకాలతో తీర్మానాలు రూపొందించి, బుక్ కీపర్ సహకారంతో రూ.లక్ష రుణాన్ని మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. రుణం మంజూరైన అనంతరం బ్యాంకు అధికారులు సభ్యులందరూ హాజరు కావాలని సూచించడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
తొలుత ఫస్ట్ లీడర్‌ను తీసుకెళ్లి వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె సభ్యులందరికీ సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఈ విషయమై సెకండ్ లీడర్‌ను ప్రశ్నించగా, ఏపీఎం సూచనల మేరకే రుణం తీసుకున్నాను. నేను తప్పు చేయలేదు అని చెప్పినట్లు సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా సంఘ తీర్మానాల పుస్తకంలోని 7, 8వ పేజీలు కనిపించకుండా పోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. తమ అనుమతి లేకుండా సంతకాలు ఫోర్జరీ చేయడం, సంఘ నిర్ణయాలను వక్రీకరించడం తీవ్ర నేరమని పేర్కొన్న సభ్యులు, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెకండ్ లీడర్‌తో పాటు సంబంధిత ఏపీఎంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై మండల ఏ.పీ.ఎం పిడమర్తి వెంకటేశ్వర్లు వివరణ కోరగా.. మాకు కూడా సమాచారం వచ్చిందని.. సభ్యుల అనుమతులు లేకుండా ఫోర్జరీ సంతకాలతో తీర్మానాలు చేసి లోన్లు పొంది ఉంటే సంబంధిత వివోఏ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.






