- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి:- ప్రొఫెసర్ హరగోపాల్
కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 10% రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% నిధులు విద్యాకు కేటాయించాలని, జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

దిశ,రాంనగర్ : కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 10% రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% నిధులు విద్యాకు కేటాయించాలని, జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ కె. చక్రధర్ రావు, కార్యనిర్వా కార్యదర్శి ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి. హరగోపాల్ ,టి పి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. తిరుపతి పలువురు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏ 21 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రతి బిడ్డ కు ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ఈ హక్కును కాపాడాల్సిన రాజ్యాంగమే (ప్రభుత్వమే )నేడు విద్యను అంగట్లో సరుకుగా మార్చి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం ఎన్ ఈ పి ద్వారా విద్యావ్యవస్థను మతీకరణ ,కేంద్రీకరణ చేస్తున్నారని ఎన్టిఏ వంటి సంస్థల వైఫల్యం వల్ల నీట్ పరీక్ష రాసిన 21 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బుగ్గిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రాజ్యాంగ ఉండాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలా మారడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు. అనంతరం చక్రధర్ రావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జె. చలపతి రావు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.తిరుపతి పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా విద్యా రంగంలో రివ్యూ మీటింగ్ లో తప్ప, బిఆర్ఎస్ అమలు చేసిన కార్పొరేటీకరణ విధానాలే కొనసాగుతున్నాయి అన్నారు.
విద్యకు అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత తక్కువగా బడ్జెట్
విద్యపై పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కాదని, ఆది భవిష్యత్ తరాలకు పెట్టుబడని చెప్పుకుంటూనే దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత తక్కువగా విద్యకు బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. తద్వారా మానిటరింగ్ వ్యవస్థ కుప్పకూలి పోతుందని, పాఠశాలలో దిగజారుతున్న ఈ పరిస్థితులను ముందే గమనించిన ప్రభుత్వ అధికారులు ,రాజకీయ నాయకులు, టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపడం మానేసి కార్పొరేట్ పాఠశాలలకు పంపుతున్నారన్నారు. పై కారణాల వలన అత్యంత పేద తల్లిదండ్రులలో కూడా ప్రభుత్వ పాఠశాలలో న్యాయమైన విద్య దొరుకుతుందని విశ్వాసం పోయి అప్పులు చేసిన ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారన్నారు. 2025-26 సంవత్సరానికి గాను 40 శాతంగా ఉన్న విద్యార్థుల శాతం 34 శాతానికి పడిపోయిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఐదు సంవత్సరాలలో ఒక్క శాతం విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో మిగలరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ప్రాంతాలలోనే రెసిడెన్షియల్ స్కూలను కొనసాగిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపనను ఆపివేయాలన్నారు. వేలాది స్కూలను నిర్లక్ష్యం చేసి మూసి వేయడానికి దారి తీసే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో స్థాపనను మానుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో కేంద్రీయ పాఠశాల స్థాయికి అభివృద్ధి చేయాలన్నారు. అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేయాలని అన్నారు. అదేవిధంగా కొత్త సంస్థలకు అనుమతులు ఇవ్వకుండా విద్యాసంస్థల నియంత్రణ చేయడానికి కావలసిన చట్టం చేసి పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ టి పి టి ఎఫ్ , డిటిఎఫ్, టీఎస్ ఈ సి, పి డి ఎస్ యు, న్యూ డెమోక్రసీ, పిడిఎస్యు మాస్ లైన్ , పి డి ఎస్ యు విజృంభణ, ఇతర విద్యారంగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






