‘జననాయగన్’ రిలీజ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న విజయ్.. వైరల్‌గా పోస్ట్

by Chukka Sudharani |

స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన చిత్రం ‘జననాయగన్’.

‘జననాయగన్’ రిలీజ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న విజయ్.. వైరల్‌గా పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన చిత్రం ‘జననాయగన్’. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు అనౌన్స్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కూడా రిలీజ్‌కు మాత్రం రావడం లేదు. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఎప్పటికప్పుడు అవంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొదట 2026 సంక్రాంతి కానుకగా తీసుకొద్దాం అని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో వాయిదా పడింది. ఇక విజయ్ రీసెంట్‌గా సీఎం అయినా కూడా ఈ సినిమా రిలీజ్ ఓ కొలుక్కి రావడం లేదు. ఇక ఇటీవల జూన్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అది కూడా సస్పెన్స్‌గా మారింది.

అయితే.. ‘జననాయగన్’ కు సంబంధించిన తమిళనాడు హక్కులను KVN ప్రొడక్షన్స్ విడిగా విక్రయించింది. కొన్ని కారణాల వల్ల, ప్రకటించిన తేదీన (జనవరి 9) రిలీజ్ కావాల్సి ఉండగా, ఆ సమయంలో విడుదల కాకపోవడం, దాదాపు ఆరు నెలల జాప్యం జరగడంతో, పంపిణీ హక్కులను కొనుగోలు చేసిన వారికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని KVN అడిగినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ థియేట్రికల్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు వెనక్కి ఇవ్వాలని విజయ్ మేకర్స్‌కి చెప్పారట. అంతే కాకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక KVN ప్రొడక్షన్స్ సొంతంగా సినిమాని విడుదల చేయాలని తెలిపారట. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చాకే OTT, శాటిలైట్ డీల్స్ ఫైనల్ చేస్తారని టాక్. విజయ్ రాజకీయ ఎంట్రీ నేపథ్యంలో ఈ సినిమా చాలా కీలకం కావడంతో రిస్క్ తీసుకోకుండా సొంతంగా రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. ఇప్పటికే బిజినెస్‌కి భారీ డిమాండ్ ఉండగా.. ఇలాంటి టైమ్‌లో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story