థార్ జీపుల కేసు: నిందితులకు మరో షాక్

by Naga Rani Yarlagadda |

గత నెలలో విజయవాడలో థార్ జీపులతో నడిరోడ్డుపై ఒకరినొకరు ఢీ కొట్టుకుని, అద్దాలు పగలగొట్టుకుని బీభత్సం సృష్టించిన కేసులో నిందితులకు కోర్టు మళ్లీ షాకిచ్చింది.

థార్ జీపుల కేసు: నిందితులకు మరో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో విజయవాడలో థార్ జీపులతో నడిరోడ్డుపై ఒకరినొకరు ఢీ కొట్టుకుని, అద్దాలు పగలగొట్టుకుని బీభత్సం సృష్టించిన కేసులో నిందితులకు కోర్టు మళ్లీ షాకిచ్చింది. నిందితులు బొల్లా ఓం, రోహిత్ లకు విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో వర్చువల్ గా జడ్జి ఎదుట హాజరపరిచారు. పోలీసులు చెప్పిన వివరాలు విన్న తర్వాత.. ఇద్దరికీ మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ.. మరోసారి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

విజయవాడలోని ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులో థార్ జీపులతో నడిరోడ్డుపై హంగామా సృష్టించిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. బొల్లా ఓంకార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఒక యువతి కోసమే ఇద్దరూ కార్ ఛేజింగ్ చేస్తూ.. పరస్పరం థార్ జీపులతో దాడులు చేసుకున్నారని వెల్లడైంది. ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

Next Story