ఆసుపత్రి బెడ్ పైనుంచి వీడియో రిలీజ్ చేసిన పండు మాస్టర్.. అసలేం జరిగిందో చెబుతూ ఎమోషనల్!

by Gantepaka Srikanth |

ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ పండు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘోర కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

ఆసుపత్రి బెడ్ పైనుంచి వీడియో రిలీజ్ చేసిన పండు మాస్టర్.. అసలేం జరిగిందో చెబుతూ ఎమోషనల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ పండు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘోర కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైజాగ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఆసుపత్రి బెడ్ పైనుంచి పండు మాస్టర్ ఒక వీడియోను విడుదల చేశారు. ప్రమాదం ఎలా జరిగింది? తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఆయన ఆ వీడియోలో అభిమానులతో పంచుకున్నారు. ప్రమాదం జరిగిన క్షణాలను పండు మాస్టర్ గుర్తుచేసుకుంటూ.. "ఓ ఈవెంట్‌కు వెళ్లి కార్లో తిరిగి వస్తున్నాం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోకి రాగానే నాకు ఒక్కసారిగా వాంతులు (Vomitings) అయ్యాయి. దాంతో కారును రోడ్డు పక్కకు ఆపాం. కారు ఆపిన కొద్దిసేపటికే.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో వాహనం మా కారును బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్‌కు నేను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాను. మళ్లీ కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి బెడ్‌పై ఉన్నాను" అంటూ ఎమోషనల్ అయ్యారు.

రెండు కాళ్లకు తీవ్ర గాయాలు..

ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఆయన హిప్ జాయింట్ (Hip Joint) డిస్లెకేట్ కావడంతో పాటు మోకాళ్ల కింద భాగంలోని ఎముకలు, జాయింట్లు బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు ఒక మేజర్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు పండు మాస్టర్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఆరోగ్యం స్థిరంగానే ఉందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈ కష్టసమయంలో తనకు అండగా నిలబడి, తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవదాలు తెలియజేశారు.

Next Story