- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
గండిపేట మండలంలోని సర్వే నెం.18లో ఉన్న సుమారు 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నార్సింగ్ పోలీసుల అరెస్ట్ చేశారు.

దిశ, శేరిలింగంపల్లి : గండిపేట మండలంలోని సర్వే నెం.18లో ఉన్న సుమారు 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నార్సింగ్ పోలీసుల అరెస్ట్ చేశారు. తప్పుడు రెవెన్యూ రికార్డులు, ఇతర నకిలీ పత్రాలు సృష్టించినట్లు గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మే 23న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ అతని డ్రైవర్ ప్రభీన్ కుమార్ ఉన్నారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం, బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ నిమ్మల కుటుంబ సభ్యులు కుట్ర పన్ని ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు అధికారిక పత్రాలు నకిలీ రికార్డులు సృష్టించినట్లు వెల్లడైంది. ఈ కుట్రలో భాగంగా బొల్లా బ్రహ్మనాయుడు సుమారు రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. అందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, ఇప్పటికే అరెస్టైన నిందితుడు రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో రూ.4 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిధులను నకిలీ జీవోలు, నకిలీ ప్రభుత్వ అనుమతులు ,తప్పుడు పత్రాల తయారీ ద్వారా భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు వినియోగించినట్లు గుర్తించారు. అరెస్టుకు ముందు బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.అనంతరం నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.






