- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీసీ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి
దేవరుప్పుల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంకు బ్రాంచ్‌ను శుక్రవార పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.

దిశ, పాలకుర్తి: దేవరుప్పుల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంకు బ్రాంచ్‌ను శుక్రవార పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు సిబ్బంది, అధికారులు మరియు స్థానిక ప్రజలతో కలిసి శాఖ కార్యకలాపాలను పరిశీలించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. రైతులు, మహిళా సంఘాలు, యువత, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ డీసీసీబీ బ్యాంకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మరియు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు పాల్గొన్నారు.






