బాలుడిని కడుపులో తన్నిన రోబో.. వీడియో వైరల్

by Muthe.Rajitha |

చైనాలో జరిగిన ఒక అంతర్జాతీయ హ్యూమనాయిడ్ రోబో (Humanoid Robot) ప్రదర్శనలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.

బాలుడిని కడుపులో తన్నిన రోబో.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : చైనాలో జరిగిన ఒక అంతర్జాతీయ హ్యూమనాయిడ్ రోబో (Humanoid Robot) ప్రదర్శనలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. రోబోల పెర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చిన ఒక బాలునిపై ఓ హ్యూమనాయిడ్ రోబో అనుకోకుండా భౌతిక దాడి చేయడంతో ఆ బాలుడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. చైనాలోని షింజియాగ్‌ రీజియన్‌ పరిధిలో గల 'ఉర్మికి బొటానికల్ గార్డెన్' (Urumqi Botanical Garden) లో గురువారం హ్యూమనాయిడ్ రోబోల ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా ఒక రోబో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను ప్రదర్శిస్తోంది. ఆ రోబోటిక్ విన్యాసాలు చేస్తున్న ఓ రోబో తన మార్షల్ ఆర్ట్స్ కదలికలను ప్రదర్శిస్తూ గాల్లోకి కాళ్లు ఊపుతున్న క్రమంలో.. దాని సెన్సార్లు ముందు నిలబడిన బాలుడిని గుర్తించలేక అత్యంత బలమైన కిక్‌ను నేరుగా అక్కడ నిలబడి ఉన్న ఒక చిన్నారి కడుపులో తన్నింది.

ఆ దెబ్బకు ఆ బాలుడు తీవ్రమైన నొప్పితో అక్కడికక్కడే విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఎగ్జిబిషన్ నిర్వాహకులు, వైద్య అధికారులు ఆ బాలుడికి ఘటనా స్థలంలోనే అత్యవసర ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ రంగ నిపుణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ పెద్ద చర్చ నడుస్తోంది. మనుషుల మధ్య తిరిగే రోబోలకు కనీస 'ప్రాక్సిమిటీ సెన్సార్స్' సరిగ్గా పనిచేయకపోతే.. భవిష్యత్తులో ఇళ్లలో, పరిశ్రమల్లో హ్యూమనాయిడ్ రోబోలను వాడటం ప్రాణాంతకంగా మారుతుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Next Story