అండమాన్ & నికోబార్ దీవుల పరిరక్షణ..! తెలంగాణ కాంగ్రెస్ సంఘీభావం

by Ramesh Naini |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునకు మద్దతుగా, అండమాన్ & నికోబార్ దీవుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ సంఘీభావం తెలియజేసింది.

అండమాన్ & నికోబార్ దీవుల పరిరక్షణ..! తెలంగాణ కాంగ్రెస్ సంఘీభావం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునకు మద్దతుగా, అండమాన్ & నికోబార్ దీవుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ సంఘీభావం తెలియజేసింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఒక వీడియో విడుదల చేశారు. ప్రకృతి పరంగా, భౌగోళికంగా ఎంతో పేరుగాంచిన నికోబార్ ఐలాండ్‌ను అదానీకి అప్పగించే ప్రక్రియ సాగుతోందని ఆరోపించారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో దీన్ని నాశనం చేస్తున్న పరిస్థితులను రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. అక్కడ ఉన్న (నావికాదళ స్థావరం) విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పర్యావరణానికి సంబంధించిన వేలాది మొక్కలను, వృక్షాలను కొట్టేస్తూ ప్రకృతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ సాగే అభివృద్ధి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, కేవలం అదానీని సంతృప్తి పరచడానికే ఒక పూర్తి ఐలాండ్‌ను అప్పగించి, దాన్ని పాడుచేసే ప్రయత్నం జరగడం సరైంది కాదన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాహుల్ గాంధీ స్ఫూర్తికి, ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ సామాజికంగా తమ మద్దతుగా నిలవాలి అని ఈ సందర్భంగా కోరారు.

ఈ అంశంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అండమాన్-నికోబార్ దీవుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రకృతి సంపదలను కాపాడుతూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

Next Story