నాగర్ కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

by Nallavelli.Anjaneyulu |

హైదరాబాద్ వాతావరణ హెచ్చరికతో రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు ఆరెంజ్ గా ప్రకటిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.

నాగర్ కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, అచ్చంపేట : హైదరాబాద్ వాతావరణ హెచ్చరికతో రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు ఆరెంజ్ గా ప్రకటిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉందని.. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పల్లె శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని పాలమూరు, వనపర్తి, గద్వాల, నారాయణ పెట,నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన మార్పుతో భాగంగానే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక చేసిన విధంగా సాయంత్రం ఐదు గంటల 10 నిమిషాల తర్వాత ఉరుములు, మెరుపులతో ఉపరితల గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు జాగ్రత్తగా ఉంటూ విద్యుత్తు స్తంభాలకు, చెట్ల కింద ఉండకుండా దూరంగా ఉండాలని సూచించారు.

Next Story