నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు..!

by Taduka Kalyani |

వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు.

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు..!
X

దిశ, ఝరాసంగం: వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలను సకాలంలో అందించేందుకు తగిన నిల్వలు ఉంచుకోవాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం నిర్వహించాలని డీలర్లకు సూచించారు. ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, అనుమతి పొందిన ఉత్పత్తులనే విక్రయించాలని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వానాకాల సాగు ప్రణాళిక, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, పురుగుమందుల వినియోగం తదితర అంశాలపై డీలర్లకు అవగాహన కల్పించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని కోరారు. అలాగే యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియాను పొందాలని రైతులకు సూచించారు. శుక్రవారం నుంచి యూరియా యాప్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ సహాయ సంచాలకులు భిక్షపతి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, మండలంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు నవాజ్ రెడ్డి, జగదీశ్వర్, విజయ్, సాయి, ధన్‌రాజ్, మచేందర్, రాంరెడ్డి, శ్రవణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story