జనగామ URS స్కూల్‌లో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..

by Kodari Anjali |

జనగామ: జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (URS)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ కింద తీసుకోనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జనగామ URS స్కూల్‌లో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..
X

దిశ, జనగామ: జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (URS)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. అకౌంటెంట్ పోస్టుకు కామర్స్‌లో డిగ్రీతో పాటు ట్యాలీ సాఫ్ట్‌వేర్‌పై అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,300 వేతనం అందజేయనున్నారు. అసిస్టెంట్ కుక్, ప్యూన్/అటెండర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించగా, నెలకు రూ.9,750 గౌరవ వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు, అనుభవం, అవసరమైతే ఇంటర్వ్యూ లేదా డెమోన్స్ట్రేషన్ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, వయసు, అనుభవ ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో కూడిన దరఖాస్తులను జూన్ 9 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. దరఖాస్తులను అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్, హైదరాబాద్ రోడ్, కళ్లెం కమాన్ ఎదురుగా, సాయి నగర్, జనగామలోని కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు స్పెషల్ ఆఫీసర్‌ను 9849628441 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Next Story