- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల రాజేందర్ పై వ్యతిరేక బ్యానర్లు కట్టడం హేయమైన చర్య: ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి
ప్రజా నేతగా ఆయనకు గౌరవం ఇవ్వాల్సిందేనని, ఆయనపై వ్యతిరేక బ్యానర్లు కట్టడం హేయమైన చర్య అని ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే బ్యానర్లు కట్టడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ, ప్రజా నేతగా ఆయనకు గౌరవం ఇవ్వాల్సిందేనని ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి చొప్పరి సోమయ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహా సభ నాయకులు మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ సాధించడంలో ఎంతో కృషి చేసి ఆంధ్రా ముఖ్యమంత్రిలతోపోరాడిన ఈటల రాజేందర్ పై ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బయ్య స్వామి , జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు బండి సారంగపాణి, ఎన్నారై రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజకుమార్ , వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి , మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిల్ల సహదేవ్ , భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు జోర్క సదయ్య , జనగాం జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు నీల రాజు , ములుగు జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు సాదు రఘు , కోరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.






