బాధ్య‌తగా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి : జ‌డ్జీ దుర్గం గ‌ణేష్

by Nallavelli.Anjaneyulu |

బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి జడ్జి గణేష్‌ మొక్కలు నాటారు.

బాధ్య‌తగా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి : జ‌డ్జీ దుర్గం గ‌ణేష్
X

దిశ, సుల్తానాబాద్: బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి జడ్జి గణేష్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి కి లభించిన విలువైన సంపద పర్యావరణం అని, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, సహజ వనరుల సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఆవుల శివకృష్ణ, ఎజిపి దూడం ఆంజనేయులు, న్యాయవాదులు మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు, జోగుల రమేష్, పెగడ శ్యామ్ సుందర్, సామల రాజేంద్ర ప్రసాద్, గుడ్ల వెంకటేష్, మల్యాల కరుణాకర్, ఆకారపు రామకృష్ణ రెడ్డి, మాదూరి పృథ్వీ, గండి శ్రీనివాస్ , కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story