- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కొత్త వైస్ చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్.. కేంద్ర రక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు
భారత వైమానిక దళం (IAF) నూతన వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళంలో (Indian Air Force) కీలకమైన నియామకం జరిగింది. ఐఏఎఫ్ నూతన వైస్ చీఫ్ (IAF Vice Chief)గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ రంగంలో అపార అనుభవం కలిగిన ఆయన, వైమానిక దళంలో అత్యంత కీలకమైన ఈ బాధ్యతలను త్వరలోనే స్వీకరించనున్నారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ 1986 డిసెంబరులో వైమానిక దళంలోని ఫైటర్ స్ట్రీమ్‌లోకి కమిషన్ అయ్యారు. ఆయన ఓ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ (QFI), ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ (Experimental Test Pilot) కావడం విశేషం. అశుతోశ్ దీక్షిత్‌కు మిరాజ్ 2000, మిగ్-21 వంటి వివిధ రకాల యుద్ధ విమానాలలో దాదాపు 3,300 గంటలకు పైగా ప్రయాణించిన ఎక్స్‌పీరియన్స్ ఉంది.
డిప్యూటీ చీఫ్ నుంచి వైస్ చీఫ్‌గా ప్రమోషన్..
ప్రస్తుతం ఈ నియామకానికి ముందు ఆయన వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (DCAS)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో భారత వైమానిక దళ ఆధునికీకరణ (Modernisation), కొత్త యుద్ధ విమానాల కొనుగోళ్లు, స్వదేశీ రక్షణ పరికరాల తయారీ (Atmanirbhar Bharat) ప్రక్రియలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ‘అతి విశిష్ట సేవా మెడల్’ (AVSM), ‘వాయు సేనా మెడల్’ (VM) పురస్కారాలతో బహుమతులతో సత్కరించింది.






