- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టోకెన్ల కోసం జోన్న రైతుల తంటాలు
మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయానికి శుక్రవారం తెల్లారక ముందే జొన్న టోకెన్ల కోసం వివిధ గ్రామాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు.

దిశ, కుబీర్: మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయానికి శుక్రవారం తెల్లారక ముందే జొన్న టోకెన్ల కోసం వివిధ గ్రామాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. సంబంధిత శాఖ సిబ్బంది శుక్రవారం నుంచి కూపన్లు ఇస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించారు. కార్యాలయానికి ముందోచ్చిన కొంతమంది రైతులు వరుస క్రమంలో పేర్లు రాసే ప్రయత్నం చేశారు. తెల్లారగానే వివిధ గ్రామాల నుంచి గుంపులు గుంపులుగా రైతులు తరలి రావడంతో వరుస కట్టే ప్రయత్నం చేశారు. కార్యాలయం తెరవకపోయినా, అధికారులు, సిబ్బంది రాకపోయినా తరలివచ్చిన రైతులతోను వాహనాలతో సందడి చేసింది. ఓ సమయంలో రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి రోజులు గడుస్తున్న టోకెన్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి, పనులను వదిలేసి పంట అమ్ముకోవడానికి అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్లు జారీ చేసి పంటను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు అంటున్నారు.






