- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుకేశ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. టైటిల్ రేసులో రెండో స్థానానికి జంప్
నార్వే చెస్ 2026లో భారత యువ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ రామేశ్‌బాబు ప్రజ్ఞానంద (R Praggnanandhaa) నార్వే చెస్-2026 టోర్నమెంట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ 9వ రౌండ్‌లో ప్రజ్ఞానంద.. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, తోటి భారత ఆటగాడైన డి.గుకేశ్‌ను (D Gukesh) క్లాసికల్ విభాగంలో దారుణంగా ఓడించాడు. నల్లటి పావులతో (Black Pieces) ఆడినప్పటికీ ప్రజ్ఞానంద అత్యంత వ్యూహాత్మకంగా ఆడి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అయితే, టోర్నమెంట్ ప్రారంభంలో వరుస ఓటములతో వెనుకబడిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా 3 క్లాసికల్ విజయాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. 7వ రౌండ్‌లో అలీరెజా ఫిరూజాను, 8వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను, 9వ రౌండ్‌లో వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌ను సైతం ఓడించి పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో ఒంటరిగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం టోర్నమెంట్ లీడర్‌గా ఉన్న అమెరికాకు చెందిన వెస్లీ సో (Wesley So) కంటే ప్రజ్ఞానంద కేవలం హాఫ్ పాయింట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు.






