- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం.. పర్యావరణ దినోత్సవ సైకిల్ ర్యాలీలో ఊహించని ఘటన
కలెక్టర్ చదలవాడ నాగరాణికి తప్పిన ప్రమాదం. మార్టేరులో పర్యావరణ దినోత్సవ సైకిల్ ర్యాలీలో సైకిల్‌కు చీర అడ్డుపడటంతో కిందపడ్డ కలెక్టర్.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఒక చిన్న ప్రమాదం తృటిలో తప్పింది. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని మార్టేరులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఒక సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ర్యాలీ కొనసాగుతున్న సమయంలో ఆమె కట్టుకున్న చీర అకస్మాత్తుగా సైకిల్ చక్రానికి అడ్డుపడింది. దీంతో బ్యాలెన్స్ తప్పి ఆమె సైకిల్‌పై నుంచి కిందపడిపోయారు. కలెక్టర్ కింద పడటాన్ని గమనించిన భద్రతా సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తమై, క్షణాల వ్యవధిలో ఆమెను పైకి లేపారు. ఈ ఘటనలో కలెక్టర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆమె యథావిధిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






