- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాకాహార ప్రియులకు తీపికబురు.. ప్రత్యేక లోగోను ఖరారు చేసిన ‘FSSAI’
భారతదేశంలో వీగన్ ఆహార ఉత్పత్తుల కోసం ‘FSSAI’ సరికొత్త ఆకుపచ్చ 'V' లోగోను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో శాఖహార జీవనశైలిని ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో లభించే సాధారణ శాకాహార (Vegetarian) ఉత్పత్తుల నుంచి వీగన్ (Vegan) ఉత్పత్తులను వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన లోగోను (Vegan Logo) ఖరారు చేస్తూ ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ సవరణ నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. అన్ని అనుమతి పొందిన వీగన్ ఆహార ప్యాకెట్లపై ఈ కొత్త లోగోను ముద్రించడాన్ని 2027 జూలై 1 నుండి తప్పనిసరి చేస్తున్నట్లుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.
లోగో ఎలా ఉంటుందంటే..
ప్రస్తుతం సాధారణ శాకాహారానికి గ్రీన్ కలర్ డాట్, మాంసాహారానికి బ్రౌన్ కలర్ డాట్ గుర్తులు ఉన్నాయి. అయితే వాటికి భిన్నంగా వీగన్ ఉత్పత్తుల కోసం రూపొందించిన లోగోలో.. ఆకుపచ్చ రంగు చతురస్రకారపు బాక్స్ (Green Square) మధ్యలో ఇంగ్లీష్ అక్షరం ‘V’ ఆకారంలో ఉండి, దానిపై ఒక చిన్న మొక్క మొలుస్తున్నట్లు డిజైన్ చేశారు. దాని కింద స్పష్టంగా ‘VEGAN’ అని రాసి ఉంటుంది. అయితే, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పర్మీషన్, సర్టిఫికేషన్ లేకుండా ఏ సంస్థ కూడా తమ ఉత్పత్తులపై ‘వీగన్’ అని ముద్రించడానికి, క్లెయిమ్ చేయడానికి వీల్లేదని నిబంధనల్లో స్పష్టం చేశారు. తయారీదారులకు ప్యాకేజింగ్, లేబ్లింగ్ మార్పుల కోసం 2027 జూలై వరకు తగినంత సమయం ఇచ్చారు.
అసలు ‘వీగన్’ అంటే ఏంటి..
సాధారణంగా శాకాహారంలో పాలు, నెయ్యి, పనీర్, తేనె వంటి జంతువుల ద్వారా లభించే ఉప ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ, వీగన్ (Vegan) ఆహారంలో మాంసంతో పాటు పాలు, డైరీ ప్రొడక్ట్స్, తేనె, జెలటిన్ వంటి జంతు సంబంధిత పదార్థాలను, యాడిటివ్స్‌ను వంద శాతం పూర్తిగా మినహాయిస్తారు. ఇవి కేవలం మొక్కల ఆధారిత (Fruits, Vegetables, Grains) పదార్థాలతోనే తయారవుతాయి. ఇన్నాళ్లూ వీగన్ ఆహారాన్ని తినే వారు ప్యాకెట్ వెనుక ఉన్న వందలాది ఇంగ్రిడియంట్స్ లిస్ట్‌ను క్షుణ్ణంగా చదివి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ కొత్త లోగో ద్వారా ప్రయాస లేకుండా క్షణాల్లో వీగన్ ఉత్పత్తులను గుర్తించి కొనుగోలు చేయవచ్చని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FASSAI) అధికారులు వెల్లడించారు.






