- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డబుల్ ఇళ్లకు డబ్బులు అడుగుతుండ్రు’.. మున్సిపల్ ఆఫీస్ ఎదుట మహిళల ఆవేదన
ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డులకు చెందిన పేద మహిళలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో కౌన్సిలర్లు డబ్బులు అడుగుతున్నారంటూ మున్సిపల్ కార్యాలయంలో ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డులకు చెందిన పేద మహిళలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో కౌన్సిలర్లు డబ్బులు అడుగుతున్నారంటూ మున్సిపల్ కార్యాలయంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
తాము పేదవాళ్లమని, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. అదే విధంగా గతంలో నిర్వహించిన లక్కీ డ్రాలో తమ పేర్లు ఎంపికయ్యాయని, అయినప్పటికీ కౌన్సిలర్లు తమకు ఇష్టం వచ్చిన వారి పేర్లు జాబితాలో చేర్చారని ఆరోపించారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమ పేర్లను లిస్ట్ నుంచి తొలగించారని వాపోయారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.






