కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా

by Kema Shiva Kumar |

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో శాఖల కేటాయింపు జరిగిన గంటల వ్యవధిలోనే అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. కొత్త మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకుడు, మంత్రి రామలింగారెడ్డి (Ramalingareddy) తన పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపు గెజిట్ విడుదలైన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవడం సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ఇచ్చిన మాట తప్పిన సీఎం డీకే..

వాస్తవానికి రామలింగారెడ్డి బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించారు. అయితే, విడుదలైన అధికారిక జాబితాలో ఆయనకు భారీ, మధ్య తరహా నీటిపారుదల (Major & Medium Irrigation) శాఖను కేటాయించారు. గతంలో సిద్ధరామయ్య కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, ఈసారి బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించగా.. సీఎం డీకే శివకుమార్ ఆ శాఖను కృష్ణ బైరగౌడ (Krishna Byre Gowda)కు కేటాయించడం గమనార్హం. ఈ సందర్భంగా రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏనాడూ పదవులను ఆశించలేదని అన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్‌లో నాకు ఫలానా పదవి కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని తెలిపారు. కానీ, సీఎం డీకే శివకుమార్ స్వయంగా తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన మాట తప్పినందుకే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని రామలింగారెడ్డి స్పష్టం చేశారు.

Next Story