ఉమ్మడి వరంగల్‌లో విషాదం.. పెళ్లికి వచ్చి గల్లంతైన బైక్ మెకానిక్

257
godawari1

దిశ, మంగపేట: బంధువులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. మల్లారుకు చెందిన మంచర్ల రాజేష్(17) తన మేనమామ, మేనత్త, ఇద్దరు మరదళ్లతో కలిసి ఉదయం గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఒడ్డు వెంట నీటి లోతు తక్కువగా ఉండడం వల్ల గోదావరి మధ్యలోకి మేనమామ గోలి రాజారాంతో కలిసి లోపలికి వెళ్లిన రాజేష్ కొద్దిసేపటికే గోదావరి వరదలో మునిగి గల్లంతైనట్లు తెలిపారు. రాజేష్ కోసం నాటుపడవలతో గాలిస్తున్నారు. రాజేష్ వెంకటాపురంలో బైక్ మెకానిక్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడురోజుల క్రితం మల్లూరులోని చీమల అర్జున కొడుకు పెళ్లి కోసం వచ్చాడు. అయితే, ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.