- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
<p>దిశ, కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన మైఖేల్ పౌల్(18) తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TS 09 FR 3868)పై కూకట్‌పల్లి జాతీయ రహదారి నుంచి నిజాంపేట్ వెళ్తుండగా.. నిజాంపేట్ కమాన్వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం(KA 03 D 2531) […]</p>

X
దిశ, కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే యువకుడు మృతిచెందాడు.
ఈ ప్రమాదంపై సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన మైఖేల్ పౌల్(18) తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TS 09 FR 3868)పై కూకట్‌పల్లి జాతీయ రహదారి నుంచి నిజాంపేట్ వెళ్తుండగా.. నిజాంపేట్ కమాన్వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం(KA 03 D 2531) వాహనం.. మితిమీరిన వేగంతో మైఖేల్పౌల్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం పౌల్ కడుపు భాగంపై నుంచి డీసీఎం వెళ్లడంతో మైఖేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
Next Story






