ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను ప్రేమలో విఫలమయ్యాయని అందువల్లే చనిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి కొండపై ప్రేమ విఫలం కావడంతో బెస్త సుధాకర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. కులం చూడకుండా ఎవరిని ప్రేమించవద్దని, పెళ్లికి ఒప్పుకోరని ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగుల మందు తాగిన వీడియోను వాట్సప్ స్టేటస్ లో యువకుడు [&hellip;]</p>

lover suicide
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను ప్రేమలో విఫలమయ్యాయని అందువల్లే చనిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి కొండపై ప్రేమ విఫలం కావడంతో బెస్త సుధాకర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. కులం చూడకుండా ఎవరిని ప్రేమించవద్దని, పెళ్లికి ఒప్పుకోరని ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగుల మందు తాగిన వీడియోను వాట్సప్ స్టేటస్ లో యువకుడు పోస్ట్ చేశాడు. వాట్సప్ స్టేటస్ చూసిన తన మిత్రులు ఉరవకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.

Next Story