- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
<p>దిశ ,వికారాబాద్: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన కొత్త కాపు సుధాకర్ రెడ్డి(27) వికారాబాద్ పట్టణంలోని గాయత్రి నర్సింగ్ హోమ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ప్రతినిత్యం ఉదయం 8 గంటల ప్రాంతంలో విధులకు హాజరై.. రాత్రి 8 గంటలకు గ్రామానికి చేరుకునేవాడు. సోమవారం డ్యూటీ కి […]</p>

దిశ ,వికారాబాద్: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన కొత్త కాపు సుధాకర్ రెడ్డి(27) వికారాబాద్ పట్టణంలోని గాయత్రి నర్సింగ్ హోమ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ప్రతినిత్యం ఉదయం 8 గంటల ప్రాంతంలో విధులకు హాజరై.. రాత్రి 8 గంటలకు గ్రామానికి చేరుకునేవాడు.
సోమవారం డ్యూటీ కి వెళ్ళిన కొడుకు తిరిగి రాకపోవడంతో.. మృతుడి తల్లి విజయ చుట్టుపక్కల వెతకడంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే గ్రామస్థుల సహాయంతో వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే సుధాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం.. అతను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కావడమేనని మృతుడి తల్లి విజయ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.






