మహిళను వేధించి..కానిస్టేబుల్ కాలర్ పట్టి..

by Shyam |

<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: బస్టాండ్‌లో మహిళను వేధించడమే గాకుండా ప్రశ్నించిన కానిస్టేబుల్‌‌ కాలర్‌ పట్టుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చి.. తిరుగు ప్రయాణమైంది. ఇదేక్రమంలో శనివారం అర్థరాత్రి 12గంటల సమయంలో అమీర్‌పేటలోని బస్టాండ్ వద్ద నిల్చోగా.. అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన పేరు మహేశ్‌గా పరిచయం చేసుకొని ఆమెతో మాటలు కలిపాడు. ఇదేక్రమంలో [&hellip;]</p>

మహిళను వేధించి..కానిస్టేబుల్ కాలర్ పట్టి..
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: బస్టాండ్‌లో మహిళను వేధించడమే గాకుండా ప్రశ్నించిన కానిస్టేబుల్‌‌ కాలర్‌ పట్టుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చి.. తిరుగు ప్రయాణమైంది. ఇదేక్రమంలో శనివారం అర్థరాత్రి 12గంటల సమయంలో అమీర్‌పేటలోని బస్టాండ్ వద్ద నిల్చోగా.. అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన పేరు మహేశ్‌గా పరిచయం చేసుకొని ఆమెతో మాటలు కలిపాడు. ఇదేక్రమంలో ఆమె చేయిపట్టి లాగడంతో కేకలు వేయగా పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఇదేక్రమంలో ప్రశ్నిస్తున్న కానిస్టేబుల్‌ను యువకుడు కాలర్ పట్టుకోవడంతో వాగ్వాదం జరిగి కానిస్టేబుల్‌ చేతికి గాయమైంది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story