- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో యువరైతు మృతి
by Shyam |
<p>దిశ, జనగామ: కరెంట్ షాక్‌తో యువరైతు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు రైతులకు గాయాలైన సంఘటన బచ్చన్నపేటలో గురువారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కామిడి సిద్ధారెడ్డి కుమారుడు కామిడి మహిపాల్ రెడ్డి(30) తన వ్యవసాయ పొలంలో వరితో పాటు కొత్తిమీర పండిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటార్ పాడైంది. గురువారం సమీప రైతులు కవ్వం సుధాకర్ రెడ్డి, ఐలేని రవీందర్ రెడ్డి సాయంతో బావిలో నుంచి […]</p>
దిశ, జనగామ:
కరెంట్ షాక్‌తో యువరైతు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు రైతులకు గాయాలైన సంఘటన బచ్చన్నపేటలో గురువారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కామిడి సిద్ధారెడ్డి కుమారుడు కామిడి మహిపాల్ రెడ్డి(30) తన వ్యవసాయ పొలంలో వరితో పాటు కొత్తిమీర పండిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటార్ పాడైంది. గురువారం సమీప రైతులు కవ్వం సుధాకర్ రెడ్డి, ఐలేని రవీందర్ రెడ్డి సాయంతో బావిలో నుంచి బోరు మోటార్ పైకి తీసేందుకు ప్రయత్నిస్తుండగా కాపర్ వైర్ తగిలి కరెంట్ షాక్ గురై మహిపాల్ రెడ్డి అక్కడిక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న ఇద్దరు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య శ్వేత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story






