ముంబై సాగా నుంచి పెప్పీ నెంబర్

by  |
ముంబై సాగా నుంచి పెప్పీ నెంబర్
X

దిశ, సినిమా : జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మి నటించిన చిత్రం ‘ముంబై సాగా’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్రం నుంచి మాస్ నెంబర్ ‘షోర్ మచేగా‌’ మొదటి పాటగా విడుదలైంది. బాలీవుడ్ ర్యాపర్ యోయో హనీసింగ్ పాడిన ఈ పాట సంగీతాభిమానులను ఆకట్టుకుంటోంది. హోమి ఢిల్లీవాలా ఈ పాటకు సాహిత్యం అందించగా ‘షోర్ మచేగా’ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్ప్లిట్ విల్లా మాజీ విజేత శ్రుతి సిన్హాతో పాటు హానీ సింగ్, ఢిల్లీవాలా కూడా ఈ వీడియోలో ఉండగా, జంగిల్ థీమ్‌లో పాటను చిత్రీకరించారు.

ఇక సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ‘ముంబై సాగా’ చిత్రం మార్చి 19 న థియేటర్లలో విడుదల అవుతుండగా, ఈ చిత్రంలో జాన్ అబ్రహం మరోసారి పూర్తి యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. కాగా ఇమ్రాన్ హష్మి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రోహిత్ రాయ్, మహేష్ మంజ్రేకర్, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు.



Next Story

Most Viewed