అవును.. గవర్నర్‌కు కరోనా పాజిటివ్!

by Chukka Sudharani |   (  Updated:2020-11-02 07:33:36  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఇంటా, బయట అందరినీ కబలిస్తూనే ఉంది. సామాన్యుడైనా.. అధికారైనా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా ఏ ఒక్కరిని వదలడం లేదు. ఈ వైరస్ ప్రభావం గతంలో కంటే కొంత తగ్గినప్పుటికీ పూర్తిగా అంతరించలేదు. తాజాగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేశీలాల్‌కు కొవిడ్-19 సోకింది. వెంటనే ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయనతోపాటు గవర్నర్ భార్య సుశీలా దేవికి, వారి [&hellip;]</p>

అవును.. గవర్నర్‌కు కరోనా పాజిటివ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఇంటా, బయట అందరినీ కబలిస్తూనే ఉంది. సామాన్యుడైనా.. అధికారైనా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా ఏ ఒక్కరిని వదలడం లేదు. ఈ వైరస్ ప్రభావం గతంలో కంటే కొంత తగ్గినప్పుటికీ పూర్తిగా అంతరించలేదు. తాజాగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేశీలాల్‌కు కొవిడ్-19 సోకింది. వెంటనే ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయనతోపాటు గవర్నర్ భార్య సుశీలా దేవికి, వారి కుటుంబ సభ్యుల్లోని మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటీవల తన సమీపంలోకి వచ్చిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ కోరారు.

Next Story