బిగ్‌బ్రేకింగ్ : పార్లమెంటులో వైసీపీ ఎంపీల హల్‌చల్..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-07-19 03:47:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సభ్యుల తీవ్ర ఆందోళన మధ్య కొనసాగుతున్నాయి. పోలవరం అంశంపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వచ్చే ఏడాదిలోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సవరించిన అంచనాలకు అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు ఎంపీలు పట్టుబట్టారు. విజయసాయిరెడ్డి వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ [&hellip;]</p>

బిగ్‌బ్రేకింగ్ : పార్లమెంటులో వైసీపీ ఎంపీల హల్‌చల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సభ్యుల తీవ్ర ఆందోళన మధ్య కొనసాగుతున్నాయి. పోలవరం అంశంపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వచ్చే ఏడాదిలోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సవరించిన అంచనాలకు అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు ఎంపీలు పట్టుబట్టారు. విజయసాయిరెడ్డి వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన నడుమ రాజ్యసభ మరోసారి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

Next Story