అవి భోగి మంటలు కాదు.. కడుపులో మంటలు : రోజా

54

దిశ, వెబ్‌డెస్క్ : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. పండగ పూట కూడా ప్రతిపక్ష నేతపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. భోగి పండుగ సందర్భంగా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన రోజా.., చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రజలు భోగి మంటలు వేసుకుంటే.. చంద్రబాబు తన కడుపులో మంటలు వేసుకున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే బాబు మాత్రం బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆమె అన్నారు.

రైతులకు వ్యతిరేకంగా జీవోలు వచ్చాయని, వాటిని తగలబెట్టి నిరసన తెలపాలని చెప్పడం చూస్తుంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందన్నారు. రైతే రాజన్న విధంగా రైతు అడిగినవి, అడగనవి కూడా చేసి రైతుకు అండగా నిలిచిన సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ జగన్‌ను దేవుడిగా గుడికట్టుకుంటే.. ప్రతిపక్ష రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.