- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి.. లోక్‌సభ స్పీకర్‌కి వైసీపీ ఎంపీ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీటీడీ భూముల అమ్మకం, ఇసుక మాఫియా, ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో తన దిష్టిబొమ్మ్లలు దహనం చేస్తున్నారని, దిష్టిబొమ్మకు పట్టిన గతే తనకు పడుతుందని అంటున్నారని, తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, నియోజకవర్గంలోనూ తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని ఈ లేఖలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న బెదిరింపులపై […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీటీడీ భూముల అమ్మకం, ఇసుక మాఫియా, ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో తన దిష్టిబొమ్మ్లలు దహనం చేస్తున్నారని, దిష్టిబొమ్మకు పట్టిన గతే తనకు పడుతుందని అంటున్నారని, తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, నియోజకవర్గంలోనూ తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని ఈ లేఖలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు స్పందించడంలేదని, అందుకే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి కూడా పంపినట్టు తెలుస్తోంది.
Next Story






