- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఊహించని షాక్ తగిలింది. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారిక కార్యక్రమానికి రాలేదని.. పరామర్శ కోసం మాత్రమే వచ్చానని శ్రీకృష్ణదేవరాయలు వారికి వివరణ ఇచ్చారు. అనధికార కార్యక్రమాలకు వస్తే కూడా ఇలా అడ్డుపడటం సబబు కాదని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఊహించని షాక్ తగిలింది. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అధికారిక కార్యక్రమానికి రాలేదని.. పరామర్శ కోసం మాత్రమే వచ్చానని శ్రీకృష్ణదేవరాయలు వారికి వివరణ ఇచ్చారు. అనధికార కార్యక్రమాలకు వస్తే కూడా ఇలా అడ్డుపడటం సబబు కాదని ఎంపీ లావు అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, స్థానిక వైసీపీ నేత కోటిరెడ్డి ఎంపీ కాన్వాయ్‌కు అడ్డుపడి వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. దీంతో చిరుమామిళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే గతంలో కూడా పురుషోత్తపట్నంలోనూ ఎంపీని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం గమనార్హం.
Next Story






