- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. కత్తి అందించింది అశోకే’
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి అశోక్ సాయం చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి గెంటేసిన జాబితాలో మొదటి పేరు చంద్రబాబుదైతే, రెండో పేరు అశోక్‌దే అని ఆరోపించారు. అశోక్ గజపతిరాజుది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. […]</p>

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి అశోక్ సాయం చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి గెంటేసిన జాబితాలో మొదటి పేరు చంద్రబాబుదైతే, రెండో పేరు అశోక్‌దే అని ఆరోపించారు. అశోక్ గజపతిరాజుది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్‌గజపతిరాజు పుట్టినరోజు నాడు విజయసాయిరెడ్డి ఇలా ట్విటర్ వేదికగా విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు పుట్టినరోజునాడు కూడా విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్తే విజయసాయిరెడ్డి మాత్రం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.






