చెప్పినట్లు చేయకపోతే చీరేస్తా.. మహిళా ఎంపీడీవో పై వైసీపీ నేత ఫైర్ (వీడియో)

by  |
ycp leader
X

దిశ, ఏపీ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. మహిళా ఎంపీడీవోపై రెచ్చిపోయాడు. చెప్పిన పని చేయకపోతే చీరేస్తానంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. వలంటీర్లను తొలగించడం, జడ్పీటీసీ ప్రొటోకాల్ విషయం నేపథ్యంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా కే ఆర్ విజయ పనిచేస్తున్నారు. ఎంపీడీవో చాంబర్‌లోనే నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ ఆమెపై దుర్భాషలాడుతూ, ఏకవచనంతో రెచ్చిపోయారు. వేళ్లు చూపిస్తూ నానా హంగామా చేశాడు. మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా కన్నెర్రజేస్తూ బీభత్సం సృష్టించాడు. దీంతో ఎంపీడీవో నచ్చకపోతే పంపించేయండని మొత్తుకున్నారు. సరిగా చేయకపోతే చీరేస్తా అంటూ వైసీపీ నేత బెదిరించారు.

ఇకపోతే కే జగన్నాధపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జెడ్పీటీసీ ప్రొటోకాల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా ఎంపీడీవోను కొందరు వైసీపీ నేతలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వైసీపీ లోని కొందరు టార్గెట్ చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీవో విలపించారు. మండలంలో కొంతమంది వైసీపీ నాయకుల మాట ఆమె వద్ద చెల్లకపోవడంతో ఆమెను కక్షగట్టి ఇలా బెదిరిస్తున్నారని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఒక మహిళా ఎంపీడీవోను చీరేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Next Story