ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది : చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-09 05:37:29  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల్లోని ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ పథకాలు కొనసాగించాలని.. గిరిజనులకు నష్టం చేకూరే పనులను చేయోద్దని [&hellip;]</p>

ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది : చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల్లోని ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ పథకాలు కొనసాగించాలని.. గిరిజనులకు నష్టం చేకూరే పనులను చేయోద్దని చంద్రబాబు హితవు పలికారు.

Next Story