బావిలో ప్రాణాలతో పోరాడిన గజఈతగాడు.. చివరకు

by  |

<p>దిశ, వెబ్‌డెస్క్ : బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు గజ ఈతగాడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చిట్టాపూర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, మృతదేహాలను వెలికి తీయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడి మృతదేహాన్ని గురువారం ఉదయం వెలికితీయడం జరిగింది.  మృతదేహాలను వెలికి తీసేందుకు వెళ్లి గజ ఈతగాడు కారులో ఇరుక్కుని ప్రాణాలతో [&hellip;]</p>

బావిలో ప్రాణాలతో పోరాడిన గజఈతగాడు.. చివరకు
X

దిశ, వెబ్‌డెస్క్ : బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు గజ ఈతగాడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చిట్టాపూర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, మృతదేహాలను వెలికి తీయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడి మృతదేహాన్ని గురువారం ఉదయం వెలికితీయడం జరిగింది. మృతదేహాలను వెలికి తీసేందుకు వెళ్లి గజ ఈతగాడు కారులో ఇరుక్కుని ప్రాణాలతో పోరాడి చివరకు కన్నుమూశాడు. గజ ఈతగాడి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్డీఓ ఆఫీసు ముందు బంధువులు ధర్నా చేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.

Next Story