సిగ్మా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

by Chukka Sudharani |

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా కలయికలో వస్తున్న చిత్రం ‘సిగ్మా’.

సిగ్మా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
X

దిశ, సినిమా: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా కలయికలో వస్తున్న చిత్రం ‘సిగ్మా’. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తమిళ స్టార్ హీరో, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఫస్ట్ సింగిల్ దుల్కర్ సల్మాన్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ‘సిగ్మ యొక్క మొదటి పాటను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రియమైన జాసన్ సంజయ్ అండ్ చిత్ర బృందం మొత్తానికి, ఈ విడుదల ఘనవిజయం సాధించాలని, అలాగే వారి ప్రయాణం అద్భుతంగా సాగాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని తెలిపాడు.

Next Story