ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఈసీదే : యనమల

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-01-10 03:00:09  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరిగే పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారం పూర్తిగా ఎన్నికల కమిషన్ దేనని ఆయన స్పష్టంచేశారు. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది బాధ్యత గవర్నర్‌దే అని చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణకు సహకరించమని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని, మద్యం షాపుల [&hellip;]</p>

Yanamala Ramakrishnudu
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరిగే పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారం పూర్తిగా ఎన్నికల కమిషన్ దేనని ఆయన స్పష్టంచేశారు. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది బాధ్యత గవర్నర్‌దే అని చెప్పుకొచ్చారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించమని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని, మద్యం షాపుల నిర్వహణకు లేని అభ్యంతరాలు పంచాయతీ ఎన్నికలకు ఉంటాయా అని యనమల మండిపడ్డారు.

Next Story