‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ మూవీపై యామిని సాదినేని ఫైర్

by  |
Sadineni Yamini
X

దిశ, ఏపీ బ్యూరో: ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ విడుదలకాక ముందే రచ్చరచ్చ చేస్తోంది. ఈ మూవీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్లు, డైలాగ్‌లు ఉన్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఏపీ బీజేపీ మహిళా నేత యామిని సాదినేని మూవీ ట్రైలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపించింది. కొత్త దర్శకుడు యుగంధర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆగస్ట్ 6న సినిమా విడుదల కానుంది.

ట్రైలర్‌లో శృంగార సన్నివేశాలు వస్తున్నపుడు ఆదిశంకరాచార్యులు రాసిన భజగోవిందం అనే బ్యాగ్రౌండ్ స్కోర్ వాడుకోవంపై ఆమె మండిపడ్డారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ సినిమాపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ట్వీటర్ వేదికగా తెలిపారు. ఇకపోతే ఈ మూవీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ట్రైలర్ వివాదాస్పదం కావడంతో దర్శకుడు యుగంధర్ మీడియా సాక్షిగా క్షమాపణలు సైతం తెలిపారు.

Next Story

Most Viewed